సహనం, శాంతి, సయోధ్య గుణాలే నీలో ఉండాలి!: - బి.ఉషారాణి- Govt టీచర్- మంచిర్యాల


అహంకారపు అంధకారమే
నీ నివాసమైతే
మానవత్వపు పరిమళం
నీ చెంతకు చేరుతుందా!

తల పొగరుగా ఉండడమే
నీ వ్యవహారమైతే
ఆత్మీయత అనుబంధాలు
నీ దరికి చేరుతాయా!

మూర్ఖత్వపు బాటలో
నువ్వు పయనిస్తుంటే
అనురాగపు తోడు
నీ చేరిక కోరుతుందా!

గర్వమే నీ ఆభరణమైతే
స్నేహ హస్తం అందించే
చెలిమి నిన్ను కోరుకుని
నీ వెంట నడుస్తుందా!

సహనం, శాంతి, సయోధ్య గుణాలు
నీలో ఉంటేనే కదా
నీ చుట్టూ పదిమంది చేరేది
నీ జీవితం ఆనందంగా నడిచేది!
కామెంట్‌లు