విశ్వ కవీంద్రుడు..రవీంద్రుడు!':-సుజాత.పి.వి.ఎల్- భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన 'జనగణమన'.. రూపకుడు.. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను ఆలపించిన ప్రభోదాత్మకుడు.. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సారి నోబెల్ బహుమతి పొందిన ప్రపంచ ప్రఖ్యాత 'గీతాంజలి' కావ్యకుడు ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో అక్కడ మనిషి సగర్వంగా తలయెత్తుకు తిరగగలడని చాటి చెప్పిన ఘనుడు.. వందేమాతర గీతం పాడిన తొలి గాయకుడు.. ఆంగ్లేయుల దౌర్జన్యాలను నిర్భయంగా ఖండించిన విమర్శకుడు.. బాల్య దశలోనే పసి హృదయాలను వికసింపచేయుటకై గురుకుల తరహాలో 'శాంతినికేతన్' నిర్మించిన స్థాపకుడు.. సత్యం, ధర్మం, సన్మార్గం, నిత్య విశాల పథాల వైపు ఎల్లప్పుడూ మనస్సు పయనించేలా సూచించిన దిశా నిర్ధేశకుడు.. మానవుడిని కృంగదీసే నిరాశా నిస్పృహలను ప్రేమ భావంతో జయించవచ్చునని తెలిపిన మహత్తర విశ్వవిఖ్యాతుడు.. భరత జాతి గర్వించదగ్గ కవీంద్రుడు! దేశభక్తిని ఎలుగెత్తి చాటిన స్వాతంత్ర్య సాధకుడు 'మన రవీంద్రుడు'!


కామెంట్‌లు