నీ తిండి నీవు తిని
నీ గాలి నీవు పీల్చుకొని
నీ కష్టం నీవు చేసి
నీ సంపద నీవు సృష్టించి.
మరో మనిషికి భయపడతావు
మరో మనిషిని ఇష్టపడతావు
మరో మనిషిని ప్రేమిస్తావు
మరో మనిషికి బానిసగా మారుతావు
మరో మనిషిని పూజిస్తావు
మరో మనిషిని సంతోష పెడతావు
నీది
అర్థం లేని నిస్వార్థం
నిన్ను నీవు ప్రేమించుకో
నిన్ను నీవు ఇష్టపడు
నిన్ను నీవు పూజించుకో
ఇది స్వార్థం కాదు
ఇదే నీకు అర్థం పరమార్థం.
రాజ్యం- సమాజం
అది అర్థంతో నడుస్తోంది!
స్వార్థంతో నడుస్తోంది!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి