బహు భాషా కోవిదుడు పి.వి నర్సింహారావు - కవి ఉండ్రాళ్ళ రాజేశం--రాజకీయ చతురులుగా, ఆర్థిక నిపుణులుగా, రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు మాజీ ప్రధాని కీ.శే పి.వి నర్సింహారావు అని కవి ఉండ్రాళ్ళ రాజేశం అన్నారు. పి.వి నర్సింహారావు జయంతి సందర్భంగా రాజేశం నివాసంలో కవులు కోణం పర్శరాములు, బస్వ రాజ్ కుమార్ లతో కలిసి పి.వి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవి ఉండ్రాళ్ళ రాజేశం మాట్లాడుతూ ప్రజాసేవలో నిరంతరం కొనసాగుతున్న రచనలు చేసిన ప్రజ్ఞాశాలి పి.వి నర్సింహారావు అన్నారు. విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వేయిపడగలును సహస్రఫణ్ గా పి.వి హిందిలో అనువాదం చేసిన అట్టి గ్రంథానికి కేంద్ర సాహిత్య పురస్కారం పొందారన్నారు. తన ఆత్మకథాత్మక నవలగా ఇన్ సైడర్ ను రచించడమే గాక తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో రాసిన గొల్ల రామవ్వ కథ అత్యంత ప్రాచుర్యత పొందిందని అన్నారు. ఎన్నో రచనలు, వ్యాసాలు రాయడమే గాక పందోమ్మిది భాషలలో పి.వి మాట్లాడడం విశేషమని, పి.వి నర్సింహారావు కవులకు ఎంతగానో తోడ్పాటు అందించారని, పి.వి సాహిత్య సేవలను రాజేశం కొనియాడారు.


కామెంట్‌లు