కందుకూరి చేపట్టిన సాహిత్య ప్రక్రియల వలన ఆయన సాహిత్య జీవనంలోను, సామాజిక జీవనము లోను, విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసు కున్నాయి. ఆయన దృష్టి సామాజిక సంస్కరణలపైమరలింది. 1883సం.లో "సతీ హిత బోధిని" అనే పత్రికను స్త్రీల కోసం, న స్త్రీ సమస్యల పరిష్కార మార్గం చేయుటకు గాను ప్రారంభించారు.కందుకూరికి ముందు ఎవరు కూడా స్త్రీ సమస్యలపై ప్రత్యేక పత్రికను ప్రారంభించే ప్రయత్నం చేయలేదు. ఈ సతీ హిత బోధిని పత్రిక ద్వారా స్త్రీల విజ్ఞాన విషయాలతో పాటు, వారి సమగ్రాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు.మాతృ పూజ, పితృ పూజ, సత్య ద్రౌపది సంవాదము, స్త్రీ నీతి దీపిక, వంటి అనేక చిన్న చిన్న రచనలు మహిళలు చదువుకొనుటకు వీలుగా మరియు గీతాలూ పాడుకోవడానికి వీలుగా రచనలు ప్రచురించారు.తరువాత కాలంలో 240 మంది తెలుగు కవుల చరిత్రలను సేకరించి గ్రంధస్థం చేసారు, మరల వీటిని మూడు భాగాలుగా విభజించి పుస్తకరూపంలో తెచ్చారు. అందుచేతనే ఈయన చరిత్రలో శాశ్వతంగా నిలిచారు. ఈయన 1876సం.లో స్వంత ఇంటి లో స్థాపింపబడిన ముద్రాక్షరశాలలో వివేక వర్ధని వంటి పలు పత్రికలు అక్కడే అచ్చు అయ్యేవి. ఈ ముద్రణాలయాన్ని మరికొందరు భాగస్వాములతో కలిసి నడిపించారు. వీరేశలింగం గారు భారతీయ చరిత్ర పురుషుల జీవిత చరిత్రలను కూడా రచించారు. రాజా రామ్మోహన్ రాయ్, అని బిసెంట్, అహల్యాబాయి, శంకరాచార్య, రామానుజచార్య, మధ్వాచార్య జీవిత చరిత్రలను వ్రాసారు. తర్కశాస్త్రం, అలంకార సంగ్రహం వంటి పలు సాహిత్య శాస్త్రీయ గ్రంధాలు రాసారు. వాచకాలు కూడ రచించారు. శృతి, స్మృతులపైవ్యాఖ్యానాలు రాసారు.ఈయన రాసిన మొదటి నవల "సత్యవతి". అది ఆనాడే తమిళం, కన్నడంఆంగ్ల భాషలలో అనువదించబడింది.మన దేశంలో మహిళలకు అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో "గలివర్ ట్రావెల్స్" అనే ఆంగ్ల కథని "సత్యరాజా పూర్వ దేశ యాత్రలు" అనే గ్రంథాన్ని రాసారు.దాన్ని రెండు భాగాలుగా విభజించారు. అందులోమొదటి భాగం- "ఆడ మళయాళం" .రెండవ భాగం"లంకా యాత్ర," ఈ గ్రంథము కూడ కందుకూరి వారికి ఎనలేని కీర్తి తెచ్చి పెట్టింది. ఇది ఆంగ్ల, కన్నడ భాషలలోనికి అనువదించబడింది.స్త్రీలకు విద్య లేకుంటే కలిగే నష్టాలు, సంఘంలోని మూఢనమ్మకాలు, పడుపు వృత్తి వల్ల కలిగే అనర్థం, ఆచారాల పేరిట జరిగే అన్యాయాలు, అక్రమాలను తీవ్రంగా గర్హించారు. అది కూడా హాస్య భరితంగా విమర్శించారు, పురుషుడ్నీ, గాడిదనీ నెలకు ఒకసారైనా దండించాలనీ, లేకపోతే వారు దారి మళ్లి చెడిపోతారని వ్యంగ్యంగా చెప్పారు. భార్య ఎంగిలిని భర్త తినడం పరమ మోక్షమని భార్య మరణిస్తే భర్త ముక్కు తెగిపోవడం ప్రాచీన ఆచారమని,ఆడ మలయాళంలో హాస్యం కలిగించే విధంగా రాశారు. దీనిని బట్టి వీరేశలింగంగారికి ఆనాటి సమాజంపై గల తీవ్ర కోపాన్ని, ఏహ్య భావాన్ని తెలియజేస్తుంది. వీరేశలింగం గారు మహిళల విషయంలో రెండు ముఖ్య రంగాలలో విశేష కృషి సల్పారు. మొదటిది స్త్రీ విద్య, రెండవది వితంతు వివాహాలు.ఆనాటి సమాజంలో పాతుకుపోయిన మూఢ విశ్వాసాలు తొలగించడానికి మరియు కులాచారాలను సంస్కరించడానికి భూత ప్రేత పిశాచాల గురించి వాస్తవిక జ్ఞానం కలిగించాలని విపరీత ప్రయత్నం చేశాడు. ప్రార్ధనా మందిరాలు నిర్మించడం, ఏకేశ్వరోపాసన ప్రచారం చేయడం, పాఠశాలలు నెలకొల్పడం ఆయన చేసిన సామాజిక సంస్కరణలు. అవి సమాజ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడ్డాయి.ఈయన ఆత్మీయ మిత్రులు చల్లపల్లి బాపయ్య, బసవరాజు గవర్రాజు వంటి కార్యశూరులు సంస్కరణాభిలాషులు, సామాజిక సంస్కరణ కార్యక్రమాలన్నింటిలో పూర్తి సహాయ సహకారాలుఅందించే వారు. డిస్ట్రిక్టు మునసబుగారైన ఆత్మూరినరసింగరావు గారు, వకీలు న్యాపతి సుబ్బారావుగారు మరియు ఏలూరి నరసింహం గారనే ఉపాధ్యాయులు ఈయన సంస్కరణోద్యమాల పట్లఎంతో ఆసక్తి కనబరచే వారు. తాము నిర్వహించేస్త్రీ పునర్వివాహాలకు, విందు భోజనాలకు హాజరయ్యేవారి పేర్ల జాబితా పట్టీగా రాసే వారు. (ఇంకా ఉంది) - ఇది 93వ భాగం - బెహరా ఉమామహేశ్వరరావు - 9290061336


కామెంట్‌లు