పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన జూనియర్ అదనపు సివిల్ జడ్జి ఏ. ప్రణయ
వికారాబాద్ జిల్లా: తాండూరు జూనియర్ అదనపు సివిల్ జడ్జి ఏ. ప్రణయ కొకట్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల (TGSWRS(G), Kokat)ను సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన 'సురక్షిత్ బచ్పన్ అభియాన్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు.
మైనర్ బాలికల భద్రత, రక్షణకు సంబంధించిన అంశాలను వివరిస్తూ పోక్సో (POCSO) చట్టం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాలికలు తమకు ఎదురయ్యే వేధింపులు, అసౌకర్యకరమైన పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి భయం లేకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. బాలల హక్కులు, రక్షణ కోసం చట్టాలు కల్పిస్తున్న అవకాశాలను వివరించారు.
అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ సరస్వతి మాట్లాడుతూ బాలికలు వ్యక్తిగత భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత, ఆత్మరక్షణ, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సరస్వతి, కృష్ణవేణి వైస్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
విద్యార్థినుల భద్రతే సమాజ బాధ్యత.. బాల్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి కర్తవ్యం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి