ఎబిసిడి చదివేసినా
అమ్మా నాన్నా అంటూ
ఆప్యాయంగా అల్లుకు పోతాను...
ఈఎఫ్ జిహెచ్ చదివేసి
ఈజీగా అమ్మమ్మ
తాతయ్యలను
ఆత్మీయంగా
చుట్టుకు పోతాను ...
ఐజే కేఎల్ చదివేసి
ఐక్యమత్యంగా
అన్నయ్య తో కలిసి
ఆడేస్తాను.....
ఎమ్ఎన్ఓపి చదివేసి
మామయ్యకు
ముచ్చటగా
ముద్దులు పెడతాను....
క్యూఆర్ఎస్ టి చదివేసి
కిలకిల మంటూ నవ్విస్తూ
నానమ్మ తాతయ్యలతో
క్వీన్ లా ఆడేస్తాను.....
యూవిడబల్యూ చదివేసి
యువరాణి లా
డాబూ దర్పం
చూపిస్తాను....
ఎక్స్ వై జెడ్ చదవేసి
ఎదురు లేదు నాకంటాను
ఎవరూ వేయరు నాకు శిక్షంటాను
ఎందుకంటే అందరి
అందాల మోక్షను నేనంటాను....!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి