ఉపాధ్యాయపర్వం-25: - రామ్మోహన్ రావు తుమ్మూరి


        ఇంటర్వ్యూ అయిన కొద్ది రోజులకు మా బి.ఎడ్ మిత్రులకు మరికొందరు బాలభారతి సహోద్యోగులకు రూ.390/-కన్సాలిడేటెడ్ ఉద్యోగాల ఆర్డర్లు అందాయి.అందులో నా పేరు లేదు. మనకు అదృష్టం లేదు అనుకున్నా.కొన్ని రోజులకు ఒక లెటర్ వచ్చింది.అందులో సోషల్ వెల్ఫేర్ స్కూల్ సిరిపూర్ లో అడహాక్ టీచర్ గా పీరియడ్ రూ.50/-చొప్పున నెలకు రూ.1100/- మించకుడా
అని.ఇది 390 లాటిదే కావచ్చుననుకొని జాయిన్ అయి కొన్ని రోజులు పని చేసిన తరువాత తెలిసింది అది ఇప్పటి విద్యావలంటీర్ లాంటిదని.నాలాం టి వాళ్లం మరి కొంతమందిమి కలిసి జెడ్పీకి వెళ్లాము.మేమందరమూ స్థానికేతరు లము కనుక మాకు రెగ్యులర్ పోస్టులు దొరకలేదు.అయితే మాకు అవకాశాన్ని బట్టి పోస్టులలో తీసుకుంటామని చెప్పారు.అనినట్టుగానే రెండునెలల తరువాత బ్లాక్ లాగే పోస్టులలో మమ్మల్ని భర్తీ చేయటం జరిగింది.
నాకు ఆదిలాబాద్ కు దగ్గరలోని కప్పర్లలో పోస్టింగ్ డైరెక్ట్ స్కేలు లో తో ఆర్డర్ వచ్చింది.గ్రహానుకూలత బాగా ఉందేమో నన్ను కిందమీదా పడి టీచరుద్యోగం లోపడేసింది విధ.లేకపోతే అంతకుముందు ఎనిమిదేళ్లుగా లేని డి.ఎస్.సి.ఆ సంవత్సరమే పెట్టడమేమిటి? ఎవరెవరు స్నేహ హస్తాలం దించటమేమిటి? బ్యాక్ లాగే పోస్టుకోసం అడ్హాక్ గా అప్పాయింట్ మెంట్ కావడమేమిటి?నాకైతే ఇప్పటికీ అదొక మిరకిల్ గానే అనిపిస్తుంది.
సరిగ్గా ఇంకా మూడు నెలలకు ఏది బార్ అవుతుందనే సమయానికి 3-1-1989 న కప్పర్లలో ఓ పంటచేనులో జరుగు తున్న టీచర్స్ పార్టీలో జాయినయ్యాను.
గమ్మత్తు కదా! చెబుతాను ఆ విషయం కూడా .
     చాలారేజులయ్యింది సదాశివ గారిని కలువక వెళ్లి వదిదామన్నారు నారాయణ గౌడుగారు.పదండి వెళ్దాం నా విషయం కూడా ఏమైనా తెలియవచ్చు అని 3 నాడు ఉదయం 5 గంటలకు కాగజ్ నగర్లో బస్సెక్కి 10 గంటలకు సారుదగ్గరికి వెళ్లాము.కాసేపు మాట్లాడిన తరువాత నేను జెడ్పీ దాకా వెళ్లివస్తాను అని వెళ్లాను.వెళ్లగానే గోడకు అంటించిన ప్రకటనలో నాపేరు ఉంది.వెంటనే ఆఫీసులోకి వెళ్లి ఓ కాపీ తీసుకుని సారు దగ్గరికి వస్తే వెంటనే వెళ్లి
జాయిన్ కమ్మని చెప్పారు.నేను కప్పర్లలో బస్టాండు లో దిగి ఊళ్లోకి నడుస్తుంటే ఓ సారు ఎదురయ్యార.ఆయనను అడిగితే స్కూల్‌లో ఎవరూ లేరు.ఈ రోజు జీతాలు పడ్డాయి.అదిగో దూరంకనిపించే చెట్లకింద పార్టీ జరుగుతుంది.అక్కడికి వెళ్లి కలవండి అని చెప్పారు. బస్టాండు నుండి ఊళ్లోకి మూడు కిలోమీటర్లు నడవాలి.అప్పటి పరిస్థితి అది.నేను సరే చూద్దాం అక్కడికైతే వెళ్దామని అటువైపు వెళ్లాను.అక్కడ నాకు తెలిసిన మిత్రుడు సూర్యప్రకాశ్ ఉన్నాడు.నన్ను గుర్తు పట్టి మిగతా సార్లకు పరిచయం చేశారు.ఇంచార్జ్ హెడ్మాస్టరుగా ఉన్నరాజన్నసారుకు లెటరు చూపించాను.సరే అని దానిమీద ఇనీషియల్ వేసి రేపారండి
అని చెప్పారు.పార్టీ నాకు సరిపడేది కాదుకనుక బై చెప్పి వచ్చాను.ఆ రోజు ఆదిలాబాదులో ఉండి మరునాడు వెళ్లి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నాను.వెళ్లిన ఒక్కడ్రెస్సుతోనే రెండు రోజులు అయోధ్యా లాడ్జిలో ఉండి ఆ ఇంటికి వచ్చి తగు ఏర్పాట్లతో మళ్లీ వెళ్లాను.అక్కడ పని చేసింది ఆరునెలలే అయినా ఫస్ట్ అపాయింట్మెంట్ అనుభవాలు చాలా బాగుంటాయి.
అయితే నాకు సహకరించిన మిత్రుడు నారాయణ గౌడుకు,అతనిమిత్రుడు బాల్ కిషన్ అసావా,డాక్టరు దామోదర్ రావు,జడిపీ ఛైర్మన్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిగారలకు,నా క్లాస్మేట్ బి.జనార్దన్,ఆయన మిత్రుడన కమిటీ మెంబర్ మధుసూ దన్ గారు,డిఇఓ సత్యనారాయణ గారు,సామల సదాశివగారు అందరికీ కృతజ్ఞతాపూర్వక వందనాలు.
(సశేషం)కప్పర్లలో 1989 X th బ్యాచ్ తో
కూర్చున్న వారిలో కుడువునండి మూడవ వాణ్ని నేనే.