భాస్కర శతకము - పద్యం (౧౦౨ - 102)

  చంపకమాల: 
 *సిరిగలవాని కెయ్యెడలఁ | జేసిన మేలది నిష్ఫలంబగున్*
*నెరిగురిగాదు పేదలకు | నేర్పునఁజేసిన సత్ఫలంబగున్*
*వరపున వచ్చి మేఘుఁడొక | వర్షము వాడిన చేలమీఁదటం*
*గురిసినఁగాక యంబుధులఁ | గుర్వఁగ నేమి ఫలంబు భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..
 మంచి డబ్బు వున్న మనిషికి, తన జీవితం తను వెళ్ళబుచ్చుకోగలిగిన వాని సహాయం చేయడం సరికాదు.  అదే సహాయం ఒక బీద కుటుంబానికి సహాయం చేస్తే అది సరైన పని.  ఎలాగంటే, ‌మేఘుడు నీటితో నిండిన తన మేఘాలను ఎండి బీటలువారిని నేలమీద వర్షం కురిపిస్తే ఆ పగుళ్లు తీసినే నేల తడిసి ముద్ద అయి, మురిసి బంగారాన్ని ఇస్తుంది.  కానీ పచ్చటి పొలాలమీద, సముద్ర ప్రాంతాలలో వర్షం కురిసిన లాభం వుండదు, నష్టం తప్ప.....అని భాస్కర శతకకారుని వాక్కు
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss