భాస్కర శతకము - పద్యం (౧౦౭ - 107)

 ఉత్పలమాల: 
 *హాళి నిజప్రబుద్ధి తిర | మైన విధంబున బెట్టు బుద్ధు లా*
*వేళల కంతెకాని మరి | వెన్కకు నిల్వవు; హేమకాంతి యె*
*న్నాళుల కుండుగాని యొక | నాఁడు పదంపడి సాన బట్టినన్*
*దాళక యుండునే యినుప | తాటకు జాయలు పోక భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..
 బంగారము యొక్క తళుకు బెలుకులు శాస్వతముగా వుంటాయి కానీ, ఒక ఇనుప ముక్కకు బంగారు మెరుగు పెడితే, అది కొన్నిరోజులు మాత్రమే వుంటుంది కానీ శస్వతముగా వుండదు. అలాగే, ఒక మనిషికి పుట్టుకతో వచ్చిన మంచి బుద్దులు ఎప్పటికీ వుంటాయి కానీ, ఎవరో ఒకరు చెప్పిన మాత్రం చేత అబ్బిన సద్గుణాలు ఆ సమయానికి పనికి వస్తాయి కానీ శాస్వతంగా వుండవు.....అని భాస్కర శతకకారుని వాక్కు
*పుట్టుకతో వచ్చిన చెడ్డ మనస్తత్వాన్ని ఎవరో ఒకరు చెప్పినందువల్ల వచ్చే మార్పు కొంత స్వల్ప సమయం పాటు వుంటుంది కానీ, ఎక్కువ కాలం ఆ ప్రభావం వుండదు.  అయితే, సద్గురువు యొక్క అనుగ్రహంతో మన ప్రవర్తన మార్చుకునే ప్రయత్నం చేస్తే, ఆ పరమగురువు రక్షణలో పరమేశ్వరుని అనుగ్రహంతో మనం మార్పును సాధించవచ్చు.  మన ప్రవర్తన లోని లోటుపాట్లను అధిగమించవచ్చు.* 
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss