రేగు పళ్ళు - భోగి పళ్ళు 2 వివిధ ఉపయోగాలు..: పి . కమలాకర్ రావు


 రేగు పండులో పీచు పదార్థం చాలా ఎక్కువ. అందువల్ల మలబద్ధకాన్ని రానివ్వదు. రేగుపండ్లు ఆకలిని తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. పొలాలలో పని చేసేవారు రేగు పళ్ళు తింటూ రోజంతా పనిలో నిమగ్నమై పోతారు. రేగు పళ్ల గింజలు తీసి కొద్దిగా మిరియాల పొడి సొంటి పొడి వేసి నీరు పోసి మరిగించి చల్లార్చి అందులో తేనె కలిపి త్రాగాలి. ఇది కఫాన్ని తగ్గిస్తుంది, దగ్గును కూడా తగ్గిస్తుంది. రేగు పండ్లను తరచూ తినేవారు త్వరగా అలసిపోరు. పల్లెటూర్లలో రేగు పండ్లను ముద్దగా దంచి అందులో చింతపండు కొద్దిగా ఉప్పు కలిపి గారె బిళ్ళల్లా తయారుచేసి ఎండబెట్టి వ రుగులుగా తయారుచేసి నిలువచేసి వాడుకుంటారు. కొంతమంది అరికాళ్ళలో రోజంతా విపరీతమైన చెమట వస్తూ ఉంటుంది. అలాంటి వారు  రేగు ఆకులను ముద్దగా నూరి రాత్రి పడుకునే ముందు  అరికాళ్లపై  లేపనంగా పూసుకోవాలి. కొద్ది రోజులలో అరికాళ్లలో  చెమట తగ్గిపోతుంది.

 రేగు ఆకులు యాంటీ ఫంగల్  లక్షణాలను కలిగి ఉంటాయి. రేగు ఆకులను ముద్దగా నూరి కొబ్బరి నూనెలో వేసి తైలంగా కాచి  వడకట్టి నిలువచేసుకోవాలి.  చర్మ సమస్యలు ఉన్నవారు దీన్ని వాడుకోవచ్చును. తగ్గిపోతాయి.