సింహస్వప్నం:- కాకర్ల రమణయ్య-గుడిపాటిపల్లి-9989134834
సాహితీ కవికళా పీఠం 
సాహితీ కెరటాలు 
===============
అబల లాంటి సమాజాన్ని
దోచుకునే దోపిడీ దారుల
దౌర్జన్యాలకు ప్రతి దాడియై..!

గుప్పెడు మెతుకుల కోసం
బ్రతుకు పోరాటం చేసే
అన్నార్తుల ఆక్రందనలకు 
ఆపన్న హస్తమై..!

శ్రామికవర్గం రక్త మాంసాలను
 పెట్టుబడిదారులు తమ
ఆదాయాలుగా మార్చుకున్నపుడు
అగ్ని జ్యాలయై..!

నకిలీ విత్తనాల రూపకర్తలు
రొమ్ము విరుచుకుని తిరుగాడి
నప్పుడు వారి పాలిట
పాసుపతాస్త్రామై.!

కల్తీ నూనెలు సమాజంలో 
అనారోగ్య హేతువులు
అయినప్పుడు రేచుక్కవై..!

అన్యాయాలు అక్రమాలు 
హెచ్చు మీరినప్పుడు 
మరో రుద్రుడివై ..!

అబద్ధాల రాజకీయాలు
కుర్చీకోసం కుస్తీ పట్టినప్పుడు
నవ చైతన్యమై..!

లంచగొండి వ్యవస్థలో 
సమూల మార్పులు అవసరం
అయినప్పుడు యమపాశమై..!

అవిర్భ వించాలి విప్లవ కెరటమై..! 
ఎదగాలి నవశకం రూపకర్తవై..!

సమ సమాజాన్ని నిర్మించి
మనుషులంతా ఒక్కటే అని
నిరూపించాలి..!

స్వార్ధం గుండెల్లో
సింహ స్వప్నమై నిలవాలి..!

కామెంట్‌లు