235.ఆహ్వాన పత్రం:: -బెలగాం భీమేశ్వరరావు,9989537835.

 2019 అక్టోబరు21 తేదీతో సాహిత్య అకాడమీ
నుంచి ఒక లేఖ వచ్చింది. దానితో పాటు ఆహ్వాన
పత్రం కూడా జతపరిచారు.లేఖలో చెన్నైలో 
మా బస వివరాలు పొందుపరిచారు. మాకు
కేటాయించిన వసతి పేరు ది రెసిడెన్సి.చెన్నైలోని
జి.ఎన్.చెట్టీ రోడ్ లో ఉంది.నవంబరు 13 నుంచి
16 వరకు మాకక్కడ వసతి సౌకర్యం ఏర్పాటు
చేశారు.లేఖతో జతపరిచిన ఆహ్వానపత్రం 
వర్ణశోభితంగా ఉంది. అది 4పేజీల పత్రం.మొదటి
పేజీలో కుడి వైపున భారత ప్రభుత్వం 3 సింహాల
గుర్తు, ఆ పక్కన గాంధీ 150వ జయంతి ఉత్సవాల బొమ్మ, ఆ తరువాత మన జాతీయ
భాష హిందీ లో సాహిత్య అకాడమీ అని రాసి ఉన్న అక్షరాలతో తీర్చిదిద్దిన మెమెంటో చిత్రం
ఉన్నాయి.ఆ గుర్తుల కింద చెన్నై నగరంలోని
వళ్లువార్ కూటం అని పిలిచే ఒక రాతి రథం 
చిత్రముంది. ఆ పేజీలోనే ఆంగ్లంలోను తమిళం లోను అవార్డుల ప్రదానోత్సవం జరిగే తేదీ జరిగే
సమయం జరిగే చోటు సూచించారు. 2019 నవంబర్ 14 సాయంత్రం 5గం.కు చెన్నైలోని
మైలాపూర్ ప్రాంతంలోని భారతీయ విద్యాభవన్
మెయిన్ ఆడిటోరియమ్ లో జరుగుతున్నట్టు
పేర్కొన్నారు.రెండవ పేజీలో 14వ తేదీ కార్యక్రమం
వివరాలు,15వ తేదీ కార్యక్రమం వివరాలున్నాయి.ఆ పక్కన 23 మంది వివిధ
భాషలకు చెందిన బాలసాహితీరచయితల పేర్లున్నాయి.ఈ వివరాలన్నీ ఆంగ్లభాషలో
ఉన్నాయి. నా పేరు చూసుకుని ముచ్చట పడ్డాను.3వ పేజీలో 2వ పేజీలో ఉన్న విషయమే
స్థానిక తమిళ భాషలో ఉంది.4వ పేజీలో ఎడమ వైపు తంజావూరు బృహదీశ్వరాలయం చిత్రముంది.కుడివైపు అకాడమీ బుక్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ కార్యక్రమం నవంబర్ 14 - 15 తేదీలలో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ కింద సాహిత్య అకాడమీ గుర్తు, అడ్రస్ ఉంది.ఆహ్వాన పత్రాన్ని
ఆ రోజు పదేపదే చూస్తూ గడిపాను.(సశేషం)