ఉపాధ్యాయపర్వం-46: - రామ్మోహన్ రావు తుమ్మూరి

 
      పాఠశాలకు సంబంధించిన కాకపోయినా రాస్పల్లిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది కనుక ఇది చెప్పవలసిన అవసరం ఉంది అనిపించింది.
      1999 మే నెలలో ఓ పత్రికా ప్రకటన వచ్చింది.అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి తరఫున వెలువడింది.రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ వారి సహకారంతో ఆం.ప్ర.రా.సా.మండలి నవరచయితల అధ్యయన శిబిరం-వచనకవిత  పై నిర్వహించే 15 రోజుల కార్యక్రమంలో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ వచ్చిన ప్రకటన నా కంటబడిం ది యాదృచ్ఛికంగా.అలా ఎందుకన్నా నంటే నాకు పేపరు చదివే అలవాటు మొదటినుంచీ లేదు.ఇప్పటికీ లేదు.
చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు.
కాని నాకు ఆసక్తి ఉండదు.ఎప్పుడో
చదివిన గుర్తు.జిడ్డు కృష్ణమూర్తి పేపరు చదవేవారు కాదని.వహ్ మనకొక సపోర్టు దొరికింది కదా అని సంతోషిం చాను. నిజానికి నాకు బహుశః పైడిమర్రి రామకృష్ణ చెప్పాడనుకుంటాను,ప్రకటన వస్తుందని.ఎందుకంటే అదివరకే జరిగిన కథాశిబిరం లో తను పాల్గొని ఉన్నాడు.సరే అప్పటి వరకు నేను రాసిన కవితలు మిగతా వివరాలతో వినతిపత్రం పంపాను.వారం రోజుల్లోనే
ఎంపికైనట్లు లేఖ వచ్చింది.జూన్ 16 నుండి జూన్ 30 వరకు పదిహేను రోజులు సెలవు పెట్టాను.ఉద్యోగస్తులకు 
ఈ కాలం ఆన్ డ్యూటీ కింద పరిగణించ బడుతుందని ఉండటంతో ఆలోచించ వలసిన పనిలేదు కదా అని బయలు దేరాను.అంటే సెలవుల తర్వాత బడి మొదలైన మూడవ రోజుననే.దానికి మండల్ ఆఫీసులో ఉన్న ప్రసాద్ సారు బాగా సహకరించి ప్రోత్సహించారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు.
     ట్యాంక్ బండి్ చివరలో ఒడ్డున సికింద్రాబాద్ వైపున్న యువజన సర్వీసుల శాఖ భవనంలో కార్యశీల మరియు విడిది.మొత్తం ఇరవై అయిదు మందిమి అనుకుంటాను.అప్పుడు ఇవన్నీ సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా ఉన్న జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ,పద్మవిభూషణ్ డా.సి నారాయణ రెడ్డి  గారి ఆలోచనా ఫలితంగా ఆయన నేతృత్వంలో జరిగిన 
కార్యక్రమం గనుక ముఖ్యం ఇది కవిత్వానికి సంబంధించింది గనుక మరింత ఆసక్తికరంగా, ప్రయోజనా త్మకంగా సాగింది.దాదాపు నలభైమంది లబ్ధప్రతిష్ఠులైన కవి పండితుల ప్రసంగాలు ఆ పదిహేను రోజులలో ఏర్పాటు చేయబడ్డాయి.నిర్వహణా బాధ్యులుగా నారాయణరెడ్డిగారి వ్యక్తిగత కార్యదర్శి శ్రీ గోవిందరాజు రామకృష్ణారావు గారు మాకు ఎంతో ఉత్సాహంగా ఏర్పాట్లు చేశారు.అక్కడే వసతి,తిండి ఏర్పాట్లు
కల్పించారు.సాధన నరసింహాచార్యులు, చిమ్మపూడి శ్రీరామనూర్తి గారలు ఏ పూట కా పూట కార్యక్రమాలను నడిపించారు. కవిత్వానికి సంబంధిం చిన వివిధ అంశాలమీద సుప్రసిద్ధ కవిపండితులను కావించి వారిచే ప్రతిసేకాంశాలమీద ప్రసంగాలు మరియు కొంతమందితో ముఖాముఖి మరియు ప్రతి రోజు ఒక అంశం నామీద 
కవిత రాయడం ఇలా పదిహేనురోజులు ఎలా గడచిపోయాయో తెలియదు.గుంటూరు శేషేంద్ర శర్మ , పోయి భీమన్న, జి.వి.సుబ్రహ్మణ్యం, కోవెల సుప్రసన్న, తిరుమల శ్రీనివా సాచార్య, డా.ఎన్.గోపి, ముదిగొండ వీరభద్రయ్య, ఎస్.వి.రామా రావు, దేవిప్రియ, కల్లూరి భాస్కరం, ఓల్గా, ఎండ్లూరి సుధాకర్ ఇంకా చాలా మంది పేర్లు  సమయానికి గుర్తు రావటం లేదు గాని చాలా మంది వారికిచ్చిన అంశం మీద మాట్లాడారు. మా అందరికి ముందుగానే సమయసా రిణి ఇచ్చారు.దాని ప్రకారం శిక్షణ కొన సాగింది.చివరి రోజు అందరకీ నారాయ ణ రెడ్డిగారి చేవ్రాలుతో ధృవీకరణ పత్రాలు అందజేయ బడ్డాయి.రానురోను ఖర్చులు ఆన్ డ్యూటీకి సంబంధించిన ఉత్తర్వులు,ఆన్ డ్యూటీ సర్టిఫికేటు ప్రభుత్వపరంగా అందించబడ్డాయి.
అప్పుడే నాతో పాటు శిబిరంలో పాల్గొన్న
మిత్రులు సడ్లపల్లి చిదంబరరెడ్డి, జి.ఆర్. కుర్మె, సుదేరా,కొమ్మవరపు విల్సన్ రావు,మడిపల్లి రాజ్ కుమార్, అరసవిల్లి కృష్ణ,జింకా సుబ్రహ్మణ్యం, మానాపురం రాజా చంద్రశేఖర్,మేకా మన్మథరావు,యశస్వి రంగనాయకి, యలమర్తి అనూరాధ, యు.వి.నరసిం హమూర్తి,అనంతుడు మిగిలిన వారి పేర్లు గుర్తుకు రావడం లేదు కాని చాలా ఉత్సాహ భరితంగా అందరం పాల్గొని పోటీలు పడి కవితలు వినిపించడం, రాయడం తలచుకుంటే ఒక అద్భుత కాలంగా నిలచిపోతుంది.తెలుగు దేశపు కవులందరినీ ఒకే చేట చూడ గల్గటం అదృష్టం.అప్పుడే నేనూ సడ్లపల్లి ఇద్దరం వారాలు గూడాలో ఉన్న అఫ్సర్ గారిని కల్పనా రెంటాల గారిని కలిసాం. జీవితంలో కొన్ని అరుదైన అవకాశాలు లభిస్తాయి. అలాంటి వాటిలో ఈ శిబిరానుభవం ఒకటి.శేషేంద్ర గారి చేతుల మీదుగా వారి 
ఆధునిక భారతం స్వీకరించటం.అదే సభకు ఒకరోజు శిలాలోలిత గారు వచ్చిన జ్ఞాపకం.ఎండ్లూరి ఆవిడను పరిచయం చేసారనుకుంటాను.అన్నిటికంటే ముఖ్యంగ నారాయణ రెడ్డి గారి తో కలిసి ఉండటం ఒక మధుర జ్ఞాపకం.(సశేషం)