మంచిపని: --జ .కీర్తన 8వతరగతి కొత్తపేట

 మహానంది గ్రామంలో ఒక వేటగాడున్నాడు.
సమీపంలోని అడవికి వేటకెళ్ళాడు.వలపన్ని       ఒక జింకను,కుందేలును పట్టాడు.జింకను భుజముపైన ఎత్తుకుని,కుందేలును చేతులతో పట్టుకుని నడుస్తున్నాడు .అడవి దాటాక ఊరు సమీపంలో బరువుగా,అల సటగా అనిపించి సేద తీరాక వెళ్దామనుకున్నాడు.ఓ చెట్టు క్రింద    
ఆగాడు.  జింకను.కుందేలును  క్రిందకు దిం       పాడు.కాళ్ళు కట్టేసివుండటం వల్ల అవి ఎక్క
డికీ పోలేవు.చెట్టుకు ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు.నిద్ర పట్టింది.
అక్కడికి కొద్దిదూరంలో ఆడుకుంటున్న పిల్లల్లో నందుడనేవాడు వేటగాడిని, జింకను,కుందేలును చూశాడు.
నిశ్శబ్ధంగా అక్కడికొచ్చాడు.జింక, కుందేలు దీనంగా చూస్తున్నాయి.మెల్లిగా వాటి కట్లువిప్పాడు.
అవి లేచి సంతోషంగా అడవి వై పు పరుగెత్తాయి.వాటిని కాపాడి
ఒక మంచి పని చేశానని వాడిమనసంతా తృప్తి  తో నిండిపోయింది .    తన స్నేహితులకు   విషయం చెప్పాడు.వాళ్ళు అభినందించారు.
  (డి.కె.చదువులబాబు సంపాదకత్వంలో విద్యార్థులు వ్రాసిన కొత్తపేటకలాలు కథాసంకలనం నుండి )