మంచిగుణం: -పి.సలోమి. కొత్తపేట.8వతరగతి.


 అనగనగా ఒక ఊరిలో దేవి అనే అమ్మాయి ఉండేది.ఆపాప చాలా మంచిది.ఒకసారి

దేవి బడికి పోతుంటే దారిలో రోడ్డు పక్కన కూర్చుని ఒక చిన్న పాపఏడుస్తూ కనిపించింది.దేవి ఆగి ఆ పాపను ఎందుకు ఏడుస్తున్నావని అడిగింది.ఆపాప కాలికి ముళ్ళు విరిగిందని తెలుసుకుంది.తనవద్ద

నున్న పిన్నీసుతో ఓర్పుతో, నేర్పుతోముళ్ళునుతీసింది.ఇక నొప్పి తగ్గిపోతుందని చెప్పింది.ఆపాపను ఇల్లు ఎక్కడో అడిగిఆసరా ఇస్తూ నడిపించుకుని వాళ్ళఇంటికితీసుకెళ్ళింది.దేవిని ఆపాప అమ్మ అభినందించింది.దేవి వెళ్తూంటే పాప

చెయ్యిఊపింది.థ్యాంక్స్ చెప్పింది.

దేవి అక్కడనుండి పాఠశాలకు చేరుకుంది.ఉపాధ్యాయులు ఆలస్యానికి కారణమడిగారు.చెప్పింది.దేవి చేసిన మంచి

పనిని ఉపాధ్యాయులు అభినందించారు.

(డి.కె.చదువులబాబు సంపాదకత్వంలో విద్యార్థులు వ్రాసిన కొత్తపేటకలాలు కథాసంకలనం నుండి) 


కామెంట్‌లు