తాత కబుర్లు( బాల గేయం )-మమత ఐల--హైదరాబాద్--9247593432


 అందమైన ఓ పాపాయి

ఎందుకు అలిగావీరోజు

మా తాత వద్దకు వెళదామ

చక్కని కబుర్లు చెబుతాడు


చూడచక్కని చిలకమ్మ

అలకలు చాలు రావమ్మా....


తాతయ్య ఓ తాతయ్య

ఈ పాపనుచూడుము ఒకసారి

అన్నం తినడం మానేసి

మూతి ముడుచుకొని కూర్చుంది


ఎందుకోసమలిగావమ్మా!

తాతను కద చెప్పాలమ్మా

అన్నయ్య పుస్తకం చింపాను

అందుకనమ్మ కొట్టింది


పుస్తకాన్ని నువు చించచ్చా

తప్పు తప్పు ఓ చిలకమ్మ

చూడకుండ లాగేసాను

సర్రున చినిగెను తాతయ్య


అన్నయ్యకు సారి చెప్పుంటే

దెబ్బలు తప్పును కదనమ్మా..

తెలియక చేసిన తప్పులకు

క్షమాపనడుగుట పరిహారం


సరేసరే ఓ తాతయ్య

తప్పక సారీ చెబుతాను

హ!హ!హ! ఓ చిలకమ్మ

కిలకిల నవ్వులు విసరమ్మా