వివేకానంద ( బాలగేయం ): -మమత ఐల--హైదరాబాద్-9247593432


 పిల్లల్లార విన్నారా

వివేకానంద బోధనలు

జ్ఞాన కిరణము అతడంట

అజ్ఞానాన్ని తరిమేసేనట


యుగపురుషుడంటె ఇతనేను

యువతకు మార్గదర్శకుడు

సత్యము బాట నడవమని

చక్కని మాటలు చెప్పాడు


పిరికి తనాన్ని విడనాడి

ధైర్యంగ బ్రతకమని నేర్పాడు

పిరికితనం వెంటాడిందో

ఏ పనిని చేయలేవన్నాడు


ఆత్మవిశ్వాసముంటేనే

విజయం వైపు వెళతావు

బలహీనున్ని చేసేటి

ఆలోచనలే వలదన్నాడు


నందుని పలుకులు నేర్చుకొని

నిజాయితీగా మెలగండి

సూక్తుల సారం తెలిసిందా

రేపు మరి కొన్ని చెబుతాను