జెండా పండుగ వస్తుంది
పోటీలెన్నో ఉంటాయి
పిల్లల్లారా రారండి
మీ సామర్థ్యము చూపండి
కబడ్డి ఖోఖో ఫుడ్బాలు
పాటలపోటి ఉపన్యాసాలు
కథలు కవితలు నృత్యాలు
వినోదానందబరితాలు
ఆటకు సిద్ధంకారండి
ఆరోగ్యానికి మంచివివి
జెండా గురించి చదవండి
ఉపన్యాసాలనివ్వండి
జెండా పాటలు నేర్వండి
ఘనమైన గొంతుతో పాడండి
బహుమతులెన్నో ఉంటాయి
పాఠశాలకిది పర్వదినం
జెండా పండుగ( బాలగేయం): ---మమత ఐల--హైదరాబాద్--9247593432