ఏదో తెలియని ఆనందంమనసున ఏదో సంతోషం
ముద్ద మోము వికసించింది
ముదుముద్దుగ కనిపిస్తున్నావు
అమ్మ పాయసం పెట్టిందా
ఆటలలో నువు గెలిచావా
కొత్త నేస్తము దొరికిందా
చిలకవోలె నువు పలకమ్మ
అయ్యో! కాదు తాతయ్య
చప్పెదాక వినవేమయ్యా
వేషము నేను ధరించాను
పదుగురినీ మెప్పించాను
హుందాగిరి వలె మీసంపెట్టి
తలపై చక్కని టోపీపెట్టి
చంద్రబోస్ నేనయ్యాను
చదువులు నేర్పే గుడిలోన
అందుకనే ఈ ఆనందం
అలకలు లేని సంతోషం
ఈరోజు జ్ఞాపకం పరమాన్నం
వినవయ్యా ఓ తాతయ్యా
పాప మనసు(బాలగేయం):-మమత ఐల--హైదరాబాద్-9247593432
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి