రామచిలక రామచిలక ఏడికెళ్తివిరాజుగారి పెరటిలోని చెట్టుమీదికి
చెట్టుమీది నుండి నాకు ఏమి తెస్తివి
కమ్మనైన జామపండు కోసుకొస్తిని
పెరటిలోన యేమేమి చెట్లుఉన్నవి
లెక్కలేని పళ్ళచెట్లు యెన్నొఉన్నవి
మంచి మంచి పళ్ళన్ని యేడబెడితివి
జామపండు ఒక్కటే నాకు తెస్తివి
కరోనాకు వ్యాక్సిన్ను ఇచ్చుచుండగా
రాకుమారుడేమొ మందు నొల్లననియెను
పట్టుబట్టి వ్యాక్సినిస్తె రాజపుత్రుడు
కంటికేడు దారలుగా యేడ్చుచుండెను
అదిచూసి నామనసు కరిగిపోయెను
ఆటలాడి పాటపాడి ముచ్చటిస్తిని
ఏడుపంత మరిచిపోయి రాకుమారుడు
పళ్లుకోసి యిమ్మనుచు దోస్తికట్టెను
ఇష్టమైన పళ్ళన్ని కోసి ఇస్తిని
యింపైన బాలునితో దోస్తికడితిని
చిటికెలోన చిరునవ్వును పట్టుకొస్తిని
చిలకనిష్టపడనివారు ఎవ్వరుండిరి
రామచిలక( బాలగేయం): -మమత ఐల:-హైదరాబాద్: -9247593432
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి