అరటిపండు తొక్కనట్ల పారవేయకుచెత్తబుట్ట ఉందికదా వెళ్ళుముందుకు
రోడ్డువైపు చూడుమచట ఏమి యుండెనో
చెట్టుపైన కోతిమనను చూచుచుండెను
బాటసారి వెళ్లునపుడు ఏమిజరిగెనో
నీకిపుడు చెబుతాను వినుము తమ్ముడు
రోడ్డుపైన పండుతిని తొక్క విసరుచూ
పట్టనట్టు చూడకుండ వెళ్లుచుండెను
చెట్టుమీద ఉన్నకోతి చూసి దానిని
తొక్కపట్టి వెంబడించె బాటసారిని
పరుగు పరుగుతో బోయి ముందునిలిచెను
బాటసారి చేతపెట్టి చూపె బుట్టను
సిగ్గుతోటి తొక్కనేసి చెత్తబుట్టలో
తలవంచి గుంజీలు తీసి వెళ్ళెను
మనిషి కన్న వానరమే గొప్పదాయెను
చూసి నేర్చుకొమ్మనుచు ఫోజులిచ్చెను
అరటి తొక్క(బాలగేయం):మమత ఐల--హైదరాబాద్--9247593432
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి