సాక్షి శతకము: --- బెహరా ఉమామహేశ్వరరావు==సెల్ నెంబరు:9290061336


 నిను నుతి సేయగ తెలియదు/

కను విప్పి నుతించ లోక గంతులకు బోవున్/ 

కనమూసి జపము చెప్పిన/

ఘన మాయను నిద్రజెంది గానను సాక్షీ//(69)


   కను మూయక కను విప్పక/

   తను మను ధనములను మరచి తన్మయుడై/

   తానను తెలివి లేక యుండిన/

   అనఘా నిను బొందు  వచ్చునయ్యా సాక్షీ//(70)


        


కామెంట్‌లు