సాక్షి శతకము: -- -బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబర్:9290061336

 ఇందున కొందరు మనుజులు/
అందము గల జంతు పక్షి తరులు గని పలున్/
సాంద్రము క్రిమి కీటకములు/
చంద్ర సూర్య పంచ భూత చయమో సాక్షీ‌//(25)
మనుజులకు మంచి చెడ్డలు/
తను వందున ధనమునందు తాపత్రయమున్/
ఘనమైన పుణ్యపాపము/
లని యెన్నో కట్టు బాట్లు అరయగ సాక్షి//(26)
              
కామెంట్‌లు