సాక్షి శతకము:- -బెహరా ఉమామహేశ్వరావు--9290061336

 అజ్ఞాన మనగా తమమును/
సుజ్ఞానంబనగ మంచి సుగుణ ములనియున్/
ప్రజ్ఞయు ధైర్య స్థైర్య కృ/
తజ్ఞతయును లోనిమిడ్చితీవే సాక్షీ//(27)
   ప్రాణ పాన వ్యాధి ఉ/
    దాన సమానంబులనగ తత్తుల్యముగన్/
    మానస సంకల్పం ములకు/
     లోనే స్తానంబునిచ్చి లీలను సాక్షీ//(28)