సాక్షి శతకము: - - బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబరు:9290061336


        

కొందరు జీవన్ముక్తులు/

కొందరు ధనవంతులవని కొందరు దుష్టుల్/

కొందరు విద్యావంతులు/

మందమతులు కడు దరిద్ర మనుజులు సాక్షీ//

      పుట్టుగతో అంధులగుట/

       ఎట్టగునో దీర్ఘరోగులెలమిని భువిలో/

       ఇట్లిన్ని రకములుండుట/

       కట్టా నీ సృష్టి చిత్ర ఘనమిది సాక్షీ//