పూలబాట:-- - -జాధవ్ పుండలిక్ రావు పాటిల్:-9441333315


 ఆటవెలది

పప్పులోన ఉప్పు పలచగైనను రుచి

నుండబోదు తిండి నుర్విజనుల

మంచిలేక మనిషి మాహాత్మ్యు డెటులౌను

పుండలీకుమాట పూలబాట


మమతలున్న చోట మమకార ముండును

కానిపించలేవుకలిమిలేమి

ప్రేమ కలిగి యున్న పెండ్లియే జరుగును

పుండలీకుమాట పూలబాట


పానిపూరితిన్న పాడౌను నుదరము

తినను బోకు నట్టి తిండి నీవు

మజ్జిగన్నమేర మనిషికిమేలగు

పుండలీకుమాట పూలబాట


గప్పు చుప్పు లన్ని గడబిడ కలిగించు

జొన్న రొట్టె కన్న మిన్న యేది

బయటి తిండి తిన్న బ్రతుకుపాడగునయ్య

పుండలీకుమాట పూలబాటమ


రవ్వ తోడ ఉమ్మ రమ్యముగాజేసి

కడుపు నిండ తిన్న కండ కలుగు

జింకు ఫుడ్డు తిన్న జీర్ణముకాదయా

పుండలీకుమాట పూలబాటమ


పూరిలోన నూనె ఊరుతుంది తినిన

కొవ్వు పెరిగి మేను కొండ యగును

అతిగ పూరి తినిన ఆరోగ్యముండునా?

పుండలీకుమాట పూలబాటమ


చింత పండు తోటి కొంత లవణమేసి

పుల్ల నద్ది తిన్న పులుపు కడుపు

లోన వెళ్లి అల్సరునుకలిగించును

పుండలీకుమాట పూలబాటమ


తెలుగు పలుకులోన తేనీయ లొలుకును

మాతృ భాష తీపి మహిమ గలది

సాటిరాదు నేది పోటి చేయనెపుడు

పుండలీకుమాట పూలబాటమ


అమ్మమాట విన్న ఆకలి తీరును

నాన్న బాట పట్ట నడక వచ్చు

తల్లిదండ్రులనగ ధరనిలో దేవుళ్ళు

పుండలీకుమాట పూలబాటమ


వనిత తోడ తగువు వసుధకు కీడగు

కష్ట బెట్ట బోకు కాంత మనసు

ఆడ వారు ననగ యాదిశక్తివటంద్రు

పుండలీకుమాట పూలబాటమ


కామెంట్‌లు