జాతీయ పతాకం
ఎగుర వేయ రావా
నిలువెత్తు దేశభక్తి
చాటుకొనగ లేవా
త్రివర్ణ పతాకం
రెపరెప మని ఆడగా
మదిమదిన ఉత్సాహం
ఉరకలేసి సాగగా
త్యాగధనుల కీర్తిని
తలచుకొని పాడగా
ఉత్తేజం నింపుకుని
అమరులను కొలువగా
స్వేచ్ఛ స్వాతంత్య్రంలు
హాయిగా అనుభవించి
ప్రగతి పథంలో మనం
కదలి సాగి పోవగా
క్రమశిక్షణ యే మనకు
ఆయుధమ్ము కాగా
ప్రపంచాన మన దేశం
అగ్రగామి కాదా
అగ్రగామి మనదేశం: --రావిపల్లి వాసుదేవరావు 9441713136
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి