భరత పుత్రుడా! (గేయ సూక్తులు)---- డాక్టర్. కొండబత్తిని రవీందర్ , కోరుట్ల . జిల్లా. జగిత్యాల9948089819


 దుష్ట వర్తన పరువు తీయును

శిష్ట రీతిని నేర్చు కోరా

మంచి తనమే మనిషి మనుగడ

యెంచి చూడగ భరతపుత్రుడ!   12


ఓట మెరుగని గుండె యిదియని

ఉక్కు పిడికిలి ఎత్తి చాటర

తెల్ల దొరలను తరిమి కొట్టిన

తెగువ నీదే భరత పుత్రుడ! 13 

 

మనిషి బ్రతుకున జ్ఞాన దీపము

తనరు చుండే యుక్తి సల్పుము

మానవాళికి అన్ని వేళల

మంచి పంచుము భరతపుత్రుడ! 14