సమాచారానికి జ్ఞాపక శక్తి కి సంబంధం ఉందా!: -- ప్రతాప్ కౌటిళ్యా--Asst Prof in Bio-Chem

 విన్నదే వినడం వల్ల చూసింది చూడడం వల్ల  మాట్లాడింది మాట్లాడడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని శాస్త్రీయంగా చాలా ఆధారాలున్నాయి . ఎలాంటి సమాచారం లేని మెదడు విభాగాల్లో ఏదేని ఒక సమాచారాన్ని మొదటిసారిగా చొప్పీస్తే  అది తొందరగా గుర్తు ఉంటుంది బాల్యంలోనే అనుభవాలు మనకి ఇప్పటికీ జ్ఞాపకమే . సమాచారం మొదటి ది తొందరగా గుర్తుంటుంది. 
 ముందుగానే బ్రెయిన్లో చాలా సమాచారం నింపబడి ఉన్నప్పుడు కొత్త సమాచారం ఎలాజ్ఞాపకం ఉంటుంది!?..   సమాచారం ఎంత ఎక్కువ ఉంటే అంత జ్ఞాపకశక్తి తగ్గుతుందా!?. సమాచారానికి జ్ఞాపకశక్తికి ఎలాంటి సంబంధం లేదనేది ఒక వాదన.   సమాచారం పెరిగేకొద్దీ కన్ఫ్యూజన్ పెరుగుతుంది. రీజనింగ్ లాజిక్ వల్ల బ్రెయిన్ అనాలసిస్ వివిధ విభాగాల పనితీరు నైపుణ్యాలు మెరుగు పడడం వలన జ్ఞాపకశక్తి  పెరిగేఅవకాశం ఉంది.
 బ్రెయిన్ లో ముందే ఉన్నా సమాచారం మళ్లీమళ్లీ వినడం చూడడం మాట్లాడడం ద్వారా ఆ సమాచారానికి కనెక్ట్ కావడం వల్ల తొందరగా గుర్తుండి పోయే అవకాశం ఉంది. తర్వాతే అది  షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ మెమొరీ గా మారే అవకాశం ఉంది. నిజానికి ఏదేనీ సమాచారం మెదడులోరికార్డు కావాలంటే మళ్లీమళ్లీ వినడం  చూడడం మాట్లాడడం అవసరం లేదు. బ్రెయిన్ లోని సమాచారానికి  జ్ఞాపక శక్తికి అవినాభావ సంబంధం ఉన్నదని నమ్మాల్సిందే.
  బ్రెయిన్ ఎంత సమాచారాన్ని అయినా స్వీకరిస్తుంది కానీ  అంతే సమాచారం లాంగ్ టర్మ్ మెమరీ గానే మిగిలిపోదు. అది దాని పరిధిలోని బ్రెయిన్ అనాలసిస్ యాక్సెప్టెన్స్ ఈ ఆధారంగా  షార్ట్ టర్మ్ మెమరీ గాను లాంగ్ టర్మ్ మెమరీ గాను , కొనసాగుతూ ఉంటుంది.  సమాచారం పెరిగేకొద్దీ జ్ఞాపక శక్తి  తగ్గుతుందని శాస్త్రీయ అవగాహన గా పరిగణించాలి