జాతీయ నాయకులు. :-రావిపల్లి వాసుదేవరావు

 బోసి నవ్వుల తాతను చూడు 
పూజ్య బాపూజీ గుర్తొచ్చేను 
కోటు పైన గులాబీ చూడు  
బాలల చాచా గుర్తొచ్చేను 
గంభీరమైన మోమును చూడు  
సర్దార్ పటేల్ గుర్తొచ్చేను 
జై జవాన్ నినాదం విను  
నేతాజీ మనకు గుర్తొచ్చేను 
గుండు  కు  ఎదురుగా గుండెను చూసిన  
ఆంధ్ర కేసరి  గుర్తొచ్చేను    
విల్లును పట్టిన వీరుని చూడు  
మన అల్లూరి గుర్తొచ్చేను 
ఎగిరే జాతి పతాకం చూడు 
పింగళి తాత గుర్తొచ్చేను  
గర్జించిన కవి గేయం పాడు 
మన గరి మెల్ల గుర్తొచ్చేను