ఎల్ద మొస్తవా..-----డా. కె.ఎల్వీ.--హనంకొండ.

 ఏం ..తాతో.
ఎల్ధ మొస్తవా..!           //  ఏం..//
గోదారొడ్డున 
గ్రామమున్నదట 
అదే ..అదే ..లె
దిండి గ్రామ మట       //ఏం..//
పచ్చ..పచ్చనీ 
పొలాలుండునట 
కొబ్బరి చెట్లకు 
కొదవే లేదట ....            //ఏం..//
చించినాడ వారథి 
చిత్రమైనదట ...
దిండి గ్రామమును 
కలుపుతున్నదట ..        //ఏం..//
పాచర్ల పూడి 
రైలు మార్గమట 
దిండి మీదు గా
పోవుచున్నదట ..           // ఏం..//
చదువు -సంధ్యలు 
సుళువై పోవునట 
బజారు బాట 
దగ్గరవ్వునట ...           // ఏం..//
అంతర్వేదికి 
దగ్గరేనట ....
లైట్ హౌజ్ కూడా 
చూడవచ్చునట !         //ఏం..//
గోదారిదాటే ..
పడవప్రయాణం 
సఖినేటి పల్లి రేవులో 
సందడి గుండునట !           // ఏం//
నరసాపురాన ..
రైలు స్టేషనట ...
హైదరాబాదుకు 
బండివున్న దట,
టికెట్టు కొనుక్కుని 
ఎక్కవచ్చునట....!              //ఏం..//
(వంగపండు ప్రసాద రావు పాటకు పేరడీ )*
ఫోటోలో >
బేబి  ఆన్షి .నల్లి .