సర్దుకుపోడం అంటేఆషామాషీ కాదు ,
అనుకున్నన్నంత
సులభమూ కాదు !
ఆడ అయినా ...
మగ అయినా ...
పిల్లలైనా ...
పెద్దలైనా ...
సర్దుకు పొవడం అంటే,
అది....
మనసులోనుంచి,
మహత్తర శక్తి ఏదో ,
జనించి,
మనిషిని
మృదువుగా
అదుపు చేయడం !
సర్దుకుపోవడం అంటే,
మనిషిలో ని ..
మనీషి గుణాలు ...
పదిమందికీ
ప్రస్పుటంగా
కనిపించడం !!
సర్థుకుపోవడం అంటే ,
మనసు గాయమైనా ,
మనిషిగానే ...
బ్రతికి ఉండడం !.......
సర్దుకుపో....: -డా.కె.ఎల్వీ.-హన్మ కొండ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి