రిపబ్లిక్ డే :---డా.కె.ఎల్.వి.ప్రసాద్,-హనంకొండ.


 జనవరి....26,

శుభా కాంక్షలతో

సరిపెట్టుకొనేది కాదు!


మన రాజ్యాంగాన్ని

మననం

చేసుకోవలసిన రోజు,


రాజ్యాంగాన్ని...

అవగాహన

చేసుకోవలసిన రోజు.


రాజ్యాంగ నిర్మాతలకు

చేతులెత్తి

నమస్కరించవలసిన రోజు.


రాజ్యాంగ నిర్మాత

డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ కు

కుసుమాంజలి

సమర్పించవలసిన రోజు.


కులమతాలకు

అతీతంగా...

గణతంత్రదినోత్సవాన్ని

చిత్తశుద్ధితో

జరుపుకోవాల్సిన రోజు.



కామెంట్‌లు