అందం:--- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 మా పాప మంచిది - మా పాప మంచిది

మాపాప అప్పుడప్పుడు - మారాం చేస్తూ ఉంటది

పాప కాళ్ళకు వెండిపట్టాలు - అందంగా ఉంటాయి

పట్టాలులేక మాపాప - మారాం చేస్తూ ఉన్నది !!మాపాప మంచిది!!

పాప చేతికి బంగారుగాజులు - అందంగా ఉంటాయి

గాజులులేక మాపాప  - మారాం చేస్తూ ఉన్నది !!మాపాప మంచిది!!

పాప చెవులకు బంగారుదుద్దులు - అందంగా ఉంటాయి

దుద్దులులేక మాపాప - మారాం చేస్తూ ఉన్నది !!మాపాప మంచిది!!

పాప ముక్కుకు వజ్రపుపుడక - అందంగా ఉంటుంది

పుడకలేక మాపాప - మారాం చేస్తూ ఉన్నది !!మాపాప మంచిది!!

పాప మెడకు బంగారుగొలుసులు - అందంగా ఉంటాయి

గొలుసులులేక మాపాప - మారాం చేస్తూ ఉన్నది !!మాపాప మంచిది!!

పాప జడకు బంగారుగంటలు - అందంగా ఉంటాయి

గంటలులేక మాపాప - మారాం చేస్తూ ఉన్నది !!మాపాప మంచిది!!

పాప నడుముకు వడ్డాణముంటే - అందంగా ఉంటుంది

వడ్డాణంలేక మాపాప - మారాం చేస్తూ ఉన్నది !!మాపాప మంచిది!!

పాపకు చక్కని పట్టుపావడా - అందంగా ఉంటుంది

పావడలేక మాపాప - మారాం చేస్తూ ఉన్నది !! మాపాప మంచిది!!