మైదానం ..: -డా.కె .ఎల్ .వి.ప్రసాద్ ,హన్మకొండ .


 కబాడీ ఆట ఉందట 

అప్పట్లో అది ....

పల్లెల్లోనే ఆడేవారట !


ఇప్పుడది -

జాతీయక్రీడ ,

అయిందట ....!


కో ..కో ..ఆట ఉందట 

అదికూడా 

పల్లెల్లో ఆడేవారట ...

ఇప్పటికీ అదిఒక క్రీడగా 

చాలమందికి తెలియదట !.


హాకీ ఆట ఉందట ...

అంతర్జాతీయ స్థాయిలో 

ఒకప్పుడు ...

మనమే నంబర్ వన్ అట !


ఫుడ్బాల్ -వాలీబాల్ ...

ప్రతిచోటా 

ఆడతారట .....

అంతర్జాతీయ ప్రతిభ 

అంతంత మాత్రమేనట !


పరుగుల రాణి 

పి .టి.ఉష 

ప్రాతినిధ్యం వహించింది 

మనదేశానికేనట ...!


తరువాత ఎందరో ...

బంగారు పతకాలు 

సాదించి పెట్టారట ...!


బాక్సింగ్ -వెయిట్ లిఫ్టింగ్ 

టెన్నీస్ -షాట్పుట్ 

షటిల్ బ్యాట్మెంటిన్ 

ఇలా ఎన్నెన్నో క్రీడలు 

మనకుండగా ...


మనవాళ్లంతా ...

క్రికెట్ ఆటకే -

నీరాజనం పలుకుతారట !

అగ్రదేశాలు కొన్ని క్రికెట్ ను 

అసలే ప్రోత్సహించరట !!


                -------

ఫోటో లో>>బేబీ..ఆన్షి.నల్లి.