భారతమాతకు జేజేలు౼ దార్ల బుజ్జిబాబు

 భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు.         ( మళ్లీ)
ఆ సేతు హిమాచల సస్యశ్యామల
జీవధాత్రికి జేజేలు.                    (మళ్లీ)
 ఆ...ఆ...ఆ...ఆ....
త్రివేణి సంగమ పవిత్రభూమి
నాల్గు వేదములు పుట్టినభూమి (మళ్లీ)
గీతామృతమును పంచినభూమి
పంచశీల భోధించిన భూమి      ( మళ్లీ)
భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
శాంతి దూతగా వెలిసిన బాపు
జాతిరత్నమై వెలిగిన నెహ్రు.    (మళ్లీ)
విప్లవ వీరులు వీరమాతలు 
ముద్దుబిడ్డలై మురిసిన భూమి (మళ్లీ)
భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
సహజీవనం సమభావనము
సమతా వాదము వేదముగా (మళ్లీ)
ప్రజా క్షేమము ప్రగతి మార్గము
లక్ష్యములైన విలక్షణ భూమి (మళ్లీ)
భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
ఆ....ఆ...ఆ....ఆ.....
ఆ సేతు హిమాచల సస్యశ్యామల
జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
ఆ...ఆ...ఆ...ఆ....
(రేపు బాలరాజుకథ చిత్రంలోని మహాబలిపురం పాట)