1)విదేశాలనుండి వచ్చిన వారి జాడ తెలియజేద్దాంవైరస్ వ్యాప్తి కాకుండా చూద్దాం
2)వ్యక్తిగత శుభ్రత ఆచరిద్దాం
పరిసరాల శుభ్రత పాటిద్దాం
3)సామూహిక సమ్మేళనాలు వద్దు
ఏకాంతంగా ఉండడమే హద్దు
4)స్వాభిమానం గల జబ్బు ఇది
స్వాగతం పలుకవద్దు మరి
5)మూడడుగుల దూరం పాటించాలి
ముప్పు నుంచి తప్పించుకోవాలి
6)నిర్లక్ష్యం,నిస్తేజం వీడి కదలాలి
పరిశుభ్రత, పరిపక్వతలతో మెలగాలి
7)సూక్ష్మజీవుల విజృంభణను
పరిశుభ్రతతో అణిచేద్దాం
8)చేతులు బాగా కడుగుదాం
చింతలు రాకుండా చూసుకుందాం
9)బాధ్యతగా మెలుగుదాం
సేవలు చేస్తున్న వారికి సహకరిద్దాం
10)అనవసరంగా బయట తిరగకండి
వైరస్ వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి
11)ఇంటింటికి షట్ డౌన్ లక్ష్మణరేఖలు
మహమ్మారిని పారద్రోలుటకు సంకేతాలు
12)ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు
కరోనా మహమ్మారిని ఆహ్వానించొద్దు
13)కంటికి కనబడని శత్రువు
హస్తప్రక్షాళనతో చావు
కరోనాపై యుద్ధం - చైతన్య నినాదాలు:-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి