ప్రియదర్శిని: --డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

నీవు తోడుంటే చాలు
ప్రపంచం నా ముందుంటుంది
నీపై నా చేతిచేళ్ళ చలనాలు
అందిస్తాయి ఎన్నో ఆనందాలు
ఏకాంతమైనా నీవుంటే చాలు గవాక్షాలు తెరిచి చూస్తే
ఎన్నో స్వేచ్ఛా దృశ్యాలు
నీతో పనికి‌ ఎక్కడి నుంచైనా రెడీ
నీతో చెలిమికి ఏ సమయమైనా సరి
నీవుంటే చాలు తిండి,నిద్ర అక్కరలేదు
మడతపెట్టి నిన్ను ఎక్కడికైనా తీసుకువెళ్తా
రాగాలు,అనురాగాలు,సరాగాలు
విరాగాలు,ప్రయోగాలు,పరిశీలనలు
అన్నీ నీతోనే సాధ్యం
పల్లెయినా,పట్నమయినా
ఇల్లయినా,ఆఫీసయినా
బాత్రూమైనా,బెడ్రూమయినా
హోటలయినా,కిచెనయినా
నీవుండాల్సిందే.
నీతో నా ప్రయాణం 
కొనసాగాల్సిందే
నీవే సమస్తం,నీవే శరణ్యం
జ్ఞాపకాలు చూసుకోవడానికైనా
ఊసులాడుకోవడానికైనా
షాపింగులకైనా,షాదీలకైనా
సోదులకైనా,సోకులకైనా
జ్ఞానానికైనా,మోసాలకైనా
నిన్ను‌ విరివిగా వాడేస్తారు
సగం శరీరం నీవైనావు
చేతుల్లో ఇమిడిపోయి
బ్యాగులోకి‌ జారిపోయి
భుజానికి అలంకారమైనావు
ఆనందం చేతికొసల్లో ఉంటే
వేరే ఆలోచనలెందుకు?
పరిసరాల స్పృహలెందుకు?
నీవు నా తోడువు
నీవు నా సుప్రభాతానివి
నీవు నా ప్రాణానివి.
కామెంట్‌లు