నీతి పద్యాలు: -సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,, ధర్మపురి

 ఆ. వె.  వేల మంది యుండ వెదుకవలసి వచ్చె
            బద్దకము వలనను శ్రద్ద లేక
             సగర పుత్రులంత సాగరము చొరరే
              రమ్య సూక్తులరయు రామ కృష్ణ!
ఆ.వె.  మనిషి యందు మంచి మర్యాద యుండిన
           సకల సద్గుణములు సంభవించు
           పాల యందు వెన్న మూల దాగును గదే
            రమ్య సూక్తులరయు రామ కృష్ణ!
ఆ.వె.  పెద్ద వారు చెప్పు ప్రియమైన మాటలు
           వినక యున్న చేటు మనకు వచ్చు
            ఆ వసిష్ఠు పలుకులవనిపతి వినడే
            రమ్య సూక్తు లరయు రామ కృష్ణ!