సర్వపితుః: --:డా.రామక‌ కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 వంశం వృద్ధి చెందాలన్నా
గోత్రం అభివృద్ధి పొందాలన్నా
మూలపురుషులైన పితృదేవతల
ఆశీర్వాదాలు అత్యవసరం.
పరలోక మార్గాలను వారికి
సుగమం చేయాలి మనం.
వారి దారిలో నీళ్ళుండవు
వారి లోకంలో భోజనముండదు
తర్పణాలతో సంతుష్టులవుతారు.
సంతర్పణలతో శాంతిస్తారు.
ఇంటిముందు నిలుస్తారు.
తమ సంతు తమకిస్తారని
సమస్త పితృదేవతల శాంతే
గృహస్థుల పరమ కర్తవ్యం.
తరతరాలు వెంట వుంటాయి.
తమ వారిని ఆశీర్వదిస్తాయి.
వారి ఆశీర్వాదాలే శుభాలు.