బాలబాలికలిద్దరు ఒకటేఇద్దరిని బాగా పెంచుటే
భేదం చూపక పాలించుటే
కన్నులు రెండున్న చూపొక్కటే!!
కొడుకని ఓ కంట
కూతురని ఇంకో కంట
చూడడం తప్పంట
ఇద్దరికి పంచాలి ప్రేమేనంటా!!
ఆడపిల్లని చులకనగా చూడకు
తక్కువ చేసి మాటాడకు
పనికిరానిదానిగా పెంచకు
చదివించు గాని కూలి నాలికి పంపకు!!
అబల కాదు ఆమె సబల
రౌడీకి వాయిస్తుంది తబల
నెరవేరుస్తుంది కన్న కల
ఇంటికి వెలుగై నిలుస్తుంది ఇల!!
బాలబాలికలు:-కవిత వేంకటేశ్వర్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి