బాల సందేశం ....:-----డా .కె .ఎల్ .వి.ప్రసాద్ ,హన్మకొండ .

 పిల్లల్లారా ...
పాపల్లారా ...
రేపటి విద్యార్థుల్లారా  ,
సాహిత్య -సాంసృతిక 
రంగాలలో ....
పాలుపంచుకునే ..
రేపటి ...
సాహిత్య కారుల్లారా 
కాబోయే ...
గొప్ప కళాకారుల్లారా !
ఆటాపాటా మాత్రమే కాదు ,
చదువులోనూ 
చేతిపనుల్లోనూ 
వివిద రకాల కళల్లోనూ 
ఎ ప్పుడూ ముందుండాలి !
బడిపుస్తకాలు మాత్రమే కాదు ,
పిల్లల కథలు 
చిట్టిపొట్టి కథలు 
మహాత్ముల జీవిత చరిత్రలు 
నదుల ఉనికి 
జంతువుల జీవన కథనాలు 
అన్నీ శ్రద్దగా చదవాలి !
వ్యాసరచనలో .....
వక్తృత్వం లో ....
చిత్ర రచనలో 
విచిత్ర వేష ధారణలో 
ఉత్సాహం చూపించాలి 
ఉన్నత శిఖరాలకు 
ఎదగాలి ....!
అత్యున్నత స్థానానికి 
పెరగాలి ....!!
------------------------------
ఫోటో  లో.....బేబీ...ఆన్షి.నల్లి.
కామెంట్‌లు