చందమామ: -- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 చందమామ రావే

జాబిల్లి రావే

పసిడి గిన్నెలో

పాలుపోసి తేవే

వెండి గిన్నెలో

వెన్న వేసి తేవే

తేరు మీద రావే

తేనెపట్టు తేవే

బండి మీద రావే

బంతి పూలు తేవే

గోడలెక్కి రావే

గోగు పూలు తేవే

కొండలెక్కి రావే

కోటి వెలుగులు తేవే

చుక్కలతో మాలికలు

చేసుకొని తేవే

మేఘాల మాలికలు

అల్లుకొని తేవే

వెన్నెలా ఝల్లులూ

కురిపించి పోవే

మాపాప మాబాబు

అలిగినారు చూడవే

వేగ నీవు రావే

వారి అలక తీర్చవే !!