రాసింది: -- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అమ్మా అప్పచ్చి లేదంది
మాపాపా అలిగింది
అమ్మా అప్పచ్చి ఇచ్చింది
మాపాపా నవ్వింది
అక్కా ఆటలు లేవంది
మాపాపా అలిగింది
అక్కా ఆటలు ఆడింది
మాపాపా నవ్వింది
అన్నా పెన్నులు లేవన్నాడు
మాపాపా అలిగింది
అన్నా పెన్నులు ఇచ్చాడు
మాపాపా రాసింది !!