నీలగిరి వృక్షం ( యూక లిప్ టస్ ) ఉపయోగాలు...: - పి . కమలాకర్ రావు


 నీలగిరి వృక్షం మన ఆరోగ్యాన్ని పరిరక్షించే వృక్షాలలో ఒకటి. దీని ఆకులు నలిపితే ఒక ఘాటైనా సుగంధం వెదజల్లుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీవైరస్ లక్షణాలను కలిగి ఉంటుంది.  దీని ఆకులను బాగా కడిగి  ముక్కలుగా త్రుంచి  నీటిలో వేసి మరిగించి చల్లార్చి చక్కెర కలిపి త్రాగితే జలుబు దగ్గు తగ్గుతుంది. శ్వాసకోశ వ్యాధులు కూడా దీనివల్ల తగ్గిపోతాయి.ఇది కాలేయానికి బలాన్నిస్తుంది. కొన్ని సూక్ష్మక్రిముల వల్ల చర్మంపై దురదలు వస్తే నీలగిరి ఆకుల కషాయం లో నిమ్మరసం పిండి చర్మంపై పూతగా వాడితే సూక్ష్మ క్రిములు నశిస్తాయి.దీని ఆకులకు నొప్పిని తగ్గించే గుణం కూడా ఉంది. దీని ఆకులను ముద్దగా నూరి ఆముదం లో కలిపి నిమ్మరసం పిండి తై లంగా తయారుచేసుకోవాలి. ఇది కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. దీని ఆకులను నీటిలో వేసి మరిగించి ఆవిరి పట్టవచ్చు. జలుబు ముక్కు కారడం తగ్గిపోతుంది. దీని ఆకులను ఎండబెట్టి కూడా వాడుకోవచ్చు.

దీని ఆకులతో తయారైన యూకలిప్టస్ ఆయిల్ ని పెంపుడు జంతువుల పై పురుగులు పెరగకుండా వాడుతారు.యూ క లిప్టస్ , వేప,మరియు తులసి ద్రావణాలతో కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని  పంటలపై  క్రిమి సంహారక మందుగా  ఉపయోగిస్తారు.

కామెంట్‌లు