మ్యావ్ మ్యావ్ పిల్లిమీసాల పిల్లి
మెత్తని అడుగుల పిల్లి
మాయల పిల్లి
మాటు వేసి తాగుతుంది
పాలు పెరుగు
దొంగ చాటుగా తాగుతుంది
నెయ్యి మీగడలు
చప్పుడు కాకుండా దూరుతోంది
చల్ల వెన్నలు మాయం
కిటికీ లోనుంచి దూరుతోంది
నెయ్యి లడ్డూ మాయం
మాయదారి పిల్లి
మా ఇంటికి రావద్దు
మత్తు కళ్ళ పిల్లి
మా వీధికి రావద్దు.
మా ఇంటిలో
బుజ్జీ తల్లులున్నారు
మా వీధిలో
బుల్లి కన్నలున్నారు.
రాణి పాట లతలు_:--Dr. కందేపీ రాణీ ప్రసాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి