కర్నాటక ప్రభుత్వం ఈ రోజు, జనవరి 19 ని *వేమన జయంతి* గా జరుపుతోంది.ఈ సందర్భంగా
ఆ.వె.(ఆటవెలది)
*ఇమ్ము దప్పువేళ* *నెమ్మలన్నియు మాని*
*కాల మొక్కరీతి గడుప వలయు*
*విజయు డిమ్ముదప్పి విరటుని గొలువడా?*
*విశ్వదాభిరామ వినుర వేమ!*
తా. అర్జునుడు, పాండవ మధ్యముడు, అరివీర భయంకరుడు. అన్నిటిని మించి ఇంద్రుని కుమారుడు. అంతటి వాడు కూడా, తమ అగ్రజుడు ధర్మరాజు జూదం /పాచికలాటలో సర్వస్వం కోల్పోయినప్పుడు, ఇపుడు కాలం తమకు అనుకాలము గాలేదు అని తెలిసుకుని, తన గాండీవమును శమీ వృక్షం పైన దాచి పెట్టి, విరాట రాజు కొలువులో బ్రుహన్నలగా/పేడి వానిగా ఆడవారికి నాట్య విద్య నేర్పుతూ సంవత్సర కాలం గడుపుతాడు....అని వేమన వాక్కు
కాబట్టి, సమయం మనకు అనుకూలించనప్పడు, నేను ఇంతటి వాడను, అంతటి వాడను అని గొప్పలకు పోకుండా, మనకు అనుకూలమైన సమయం వచ్చే వరకు వేచి వుండటం తెలివైన వారి లక్షణం.
*"అలవి కాని చోట అధికుల మనరాదు, నేల విడిచి సాము చేయరాదు,"* అని పెద్దల మాట.
*కాలం మనది కానపుడు, గొప్పలకు పోయి చేతులు కాల్చుకోకుండా, తమ పౌరుషము, బలము చెల్లదని గ్రహించి నెమ్మదిగా ఉండేవాడు బుద్ధిమంతుడు*....
.....ఓం నమో వేంకటేశాయ
వేమన జయంతి : Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి