అడవి చెన్నంగి చెట్లు రోడ్డుకిరువైపులా పసుపు పచ్చని పూలతో కనిపిస్తుంటాయి. సన్నని పొడవాటి కాయలు నాలుగు అంగుళాల పొడవు కలిగి ఉంటాయి. ఈ చెట్లు వాటంతటవే చెత్తకుప్పల పై మొలుస్తాయి.దీని ఆకులు కాయలోని గింజలు వేరు భాగం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఇది పిత్త వ్యాధుల్ని నయం చేస్తుంది. కఫం పెరగకుండా కాపాడుతుంది. చర్మ వ్యాధులను నయం చేస్తుంది. తేలు , సాలపురుగుల విషాన్ని విరిచేస్తుంది.
దీని ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి ధనియాలు కలిపి మరిగించి చల్లార్చి కషాయం త్రాగితే మూత్రంలో రక్తం రాకుండా కాపాడుతుంది. మలబద్దకానికి కూడా ఇది మంచి మందు. దీని ఆకుల కషాయం త్రాగితే ఊపిరితిత్తుల వ్యాధులు అస్తమా తగ్గిపోతుంది. దీని ఆకులను ముద్దగా నూరి పుళ్లపై పూస్తే పుళ్ళుతగ్గి పోతాయి. కసివింద చెట్టు వేరు భాగాన్ని మెత్తగా దంచి పుల్లని మజ్జిగ తో కలిపి సోరియాసిస్ ఉన్న వారికి చర్మంపై రాస్తే సోరియాసిస్ తగ్గుముఖం పడుతుంది. దీని ఆకుల రసాన్ని వేడిచేసి చల్లార్చి త్రాగితే కడుపులోని క్రిములు మలవిసర్జన లో బయటికి వస్తాయి.
జలోదర వ్యాధిలో కడుపంతా ఉబ్బిపోయి బాధ పడుతుంటారు. అలాంటప్పుడు దీని వేరును బాగా నలగ్గొట్టి దాంట్లో నిమ్మరసం కలిపి కడుపుపై, బొడ్డు కింద వరకు రసాన్ని లేపనంగా పూయాలి. మరికొంత వేరు రసాన్ని మజ్జిగలో కలిపి త్రాగించాలి. జలోదర వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
తేలు కుట్టినప్పుడు దీని వేరు రసాన్ని తేలు కుట్టిన చోట రుద్దాలి. సాలెపురుగు కందిరీగ కుట్టినప్పుడు దీని ఆకుల ముద్దను పూయాలి. విష ప్రభావం తగ్గిపోతుంది.
కసివింద కాయలోని ఎండిపోయిన గింజల్ని నేతిలో వేయించి పొడిగా చేసి పాలు కలిపి కాఫీ లాగా త్రాగాలి. కసివింద కాఫీ శరీరానికి మంచి శక్తినిస్తుంది ఉత్తేజాన్ని ఇస్తుంది అలసటను దూరం చేస్తుంది. అందువల్ల దీనికి నీగ్రో కాఫీ అనే పేరు వచ్చింది .
అడవి చెన్నంగి లేదా కసివింద (Ñegro Coffee)... ఔషధ గుణాలు. : పి కమలాకర్ రావు
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి