వికారాబాద్ జిల్లా తాండూర్‌లో ఆర్ట్ అండ్ సమ్మర్ క్యాంప్ : వెంకట్ , మొలక ప్రతినిధి

  తాండూర్ మాజీ చైర్‌పర్సన్  కోట్రిక విజయలక్ష్మి కోడలు నాగలక్ష్మి ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు నడిపిస్తున్నారు  విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికి తీయాలనే లక్ష్యంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు.
క్యాంప్‌లో భాగంగా పిల్లలకు వేస్ట్ బాటిళ్లను అందమైన పూలదానాలుగా మార్చడం నేర్పించారు. అలాగే డ్రై క్లేతో పూలు, బొమ్మలు వంటి ఆకర్షణీయ వస్తువులు తయారు చేయడం చూపించారు. సాధారణంగా పిల్లలు ఈ క్లేతో కేవలం ఆడుతారు, కానీ దీని ద్వారా ఎన్నో సృజనాత్మక వస్తువులు తయారు చేయవచ్చని వారికి అవగాహన కల్పించారు.
ఈ క్లే స్టేషనరీ దుకాణాల్లో సులభంగా లభ్యమవుతుందని తెలిపారు. అంతేకాకుండా చేతి అరలో పూలు లేదా ఇతర ఆకృతులు తయారు చేయడం ఒక రకమైన వ్యాయామంలా పనిచేస్తుందని, ఇది ఆక్యుపంక్చర్ తరహాలో ప్రయోజనం ఇస్తుందని వివరించారు. దీని ద్వారా పిల్లలకు ఆటతో పాటు వ్యాయామం కూడా కలుగుతుందని చెప్పారు.
బాల్య దశలో నేర్చుకున్న కళలు భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు  నాగ లక్మీ తెలిపారు.
కామెంట్‌లు